రుచికరమైన ఆహారం పెట్టాలి
వేలూరు:ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉద యం, మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా పెట్టాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. మీ కోసం మీ ఊరిలో ఒక రోజు పథకంలో బాగంగా వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపాలిటీలోని మున్సిపల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును, అల్పాహారం, మధ్యాహ్న భోజన నాణ్యతా వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం మున్సిపాలిటీలో సేకరిస్తున్న చెత్తను ఎరువు చేసి విక్రయించే పథకాన్ని పరిశీలించారు. పారిశుధ్య కార్మికులు కుటుంబసభ్యుల వద్ద ప్లాస్టిక్, చెత్త వేర్వేరుగా చేసి ఇచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా రైతు బజారును తనిఖీ చేసి రైతులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతు బజారులో రైతులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని కోరడంతో వీటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అములు, మున్సిపల్ చైర్మన్ సౌందర్‌రాజన్, మున్సిపల్ కమిషనర్ మంగయకరసర్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment