అప్పుల బాధతో పెయింటర్ ఆత్మహత్య
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని అయ్యనూరు గ్రామానికి చెందిన సెల్వకుమార్(30) పెయింటర్. ఇతను పలువురి వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో అప్పు తిరిగి ఇవ్వాలని వారు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన సెల్వకుమార్ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా సెల్వకుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని మృతదేహాన్ని తీసుకోబోమని బందువులు ప్రభుత్వాస్పత్రిని ముట్టడించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశన్ ఆందోళనకారులతో చర్చలు జరిపి ముట్టడిని విరమింపజేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
మృతదేహాన్ని తీసుకోకుండా
బంధువులు ఆస్పత్రి ముట్టడి
Comments
Please login to add a commentAdd a comment