లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బూచీ
● అర్ధరాత్రి అధికారులు ఉరుకులు, పరుగులు ●అర్ధరాత్రి అధికారులు ఉరుకులు, పరుగులు ●చైన్నె విమానాశ్రయంలో కలకలం చైన్నె విమానాశ్రయంలో కలకలం
సేలం : జర్మనీ నుంచి చైన్నెకి వచ్చిన లుప్తాన్సా ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానానికి బాంబు పేలుడు బెదిరింపు వచ్చింది. దీంతో చైన్నె విమానాశ్రయంలో కలకలం రేగింది. జర్మనీ దేశం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ నగరం నుంచి లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం 274 మంది ప్రయాణికులతో చైన్నెకి సోమవారం బయలుదేరింది. ఈ విమానం అర్ధరాత్రి 12 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. అయితే రాత్రి 11 గంటల సమయంలో చైన్నె విమానాశ్రయానికి ఓ ఈ–మెయిల్ వచ్చింది. అందులో జర్మన్ దేశం నుంచి చైన్నెకి వస్తున్న లుప్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు పెట్టినట్టు ఉంది. వెంటనే విమానాశ్రయ భద్రతా బృందం చైన్నె విమానాశ్రయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అందులో అర్ధరాత్రి 12.16 గంటలకు చైన్నె విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఆ విమానంలో బాంబు స్క్వాడ్ నిపుణులు, సోదాలు చేశారు. సుమారు గంట సేపటికి పైగా సోదాలు చేపట్టగా, ఎలాంటి బాంబులు లేవని తెలియడంతో అది కేవలం బెదిరింపు మాత్రమే అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఈ విమానం అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి వేకువజామున 2 గంటలకు తిరిగి వెళుతుంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మంగళవారం వేకువజామున 4 గంటలకు ఈ విమానం 265 మంది ప్రయాణికులతో చైన్నె విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫార్ట్‌కు బయలుదేరి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment