అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ మృతి

Published Wed, Feb 5 2025 12:40 AM | Last Updated on Wed, Feb 5 2025 12:40 AM

అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ మృతి

అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ మృతి

సేలం: తేని జిల్లా కూడలూర్‌ సమీపంలో తోటలో పనికి వెళ్లిన కార్మికురాలు ఏనుగు దాడిలో మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది. వివరాలు.. తేనిజిల్లా కూడలూరు సమీపంలో ఉన్న లేయర్‌ క్యాంప్‌ వెట్టుకాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి పిచ్చకుట్టి. ఇతని భార్య సరస్వతి. కూలీ కార్మికులు అయిన వీరు తోటలో పని వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఎప్పటిలానే అళగేశన్‌ అనే వ్యక్తి తోటలో పనికి సరస్వతి వెళ్లింది. ఈ స్థితిలో పని ముగిసిన తర్వాత అడవి ప్రాంతం ఆనుకుని ఉన్న చింత చెట్టు ప్రాంతంలో వస్తుండగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ అడవి ఏనుగు సరస్వతిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న కుములి పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ ప్రాంతంలో అడవి నుంచి నివాస ప్రాంతాలలోకి వచ్చే జంతువుల సంఖ్య అధికమైనట్టు అధికారులు తెలుపుతున్నారు. అవి రాకుండా తగు చర్యలు చేపడుతామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement