![పొగ మంచు పంజా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04cni24-300102_mr-1738695945-0.jpg.webp?itok=ao6Eq3e2)
పొగ మంచు పంజా
సేలం : చైన్నె, శివారు ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా అధికంగా మంచు కురుస్తోంది. ఈ స్థితిలో మంగళవారం ఉదయం సాధారణంగా కంటే అధికంగా పొగ మంచు కమ్మేసింది. రోడ్లపై ముందు వెళ్లే వాహనాలు కనిపించనంగా పొగ మంచు ఆవహించింది. ఈ కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ముఖ్య రోడ్లపై ఉదయం 8 గంటల వరకు వాహనాలు హెడ్‌లైట్‌ల వెలుగులో నత్తనడకన సాగాయి.
40 విమానాలు ఆలస్యం..
ఇదే విధంగా చైన్నె విమానాశ్రయం మొత్తం పొగ మంచుతో కప్పేసింది. విమానాశ్రయ భవనాలు, రన్‌వే కనిపించనంతగా మంచు కురిసింది. దీంతో 40కి పైగా విమానాల రాకపోకల్లో ఆలస్యమయ్యాయి. రెండు గంటల నుంచి 5 గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. అదే విధంగా చైన్నె విమానాశ్రయంలో ల్యాండ్ కాలేక ఎనిమిది విమానాలు బెంగుళూరు, తిరువనంతపురం, హైదరాబాద్‌లకు దారి మళ్లించారు. లండన్ నుంచి 317 మంది ప్రయాణికులతో చైన్నెకి వచ్చిన బ్రిటీష్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం బెంగళూరుకు, మస్కట్ నుంచి 252 మంది ప్రయాణికులతో ఓమన్ ఎయిర్‌లైన్స్ విమానం బెంగళూరుకు, హైదారాబాద్ నుంచి 162 మంది ప్రయాణికులతో చైన్నెకి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం తిరువనంతపురానికి, పూణే నుంచి 152 మంది ప్రయాణికులతో వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం తిరువనంతపురానికి దారి మళ్లించారు. కువైట్ నుంచి 148 మంది ప్రయాణీకులతో చైన్నెకి వచ్చిన ప్రయాణికుల ఎయిర్ ఇండియా విమానం చైన్నెలో ల్యాండింగ్ కాలేక ఆకాశంలో అర్ధగంటకు పైగా చెక్కర్లు కొట్టింది. చివరికి ఎట్టకేలకు ల్యాండ్ అయ్యింది.
చైన్నె విమానాశ్రయాన్ని కమ్మేసిన పొంగ మంచు
చైన్నెలో 40 విమానాలు ఆలస్యం 8 విమానాలు దారి మళ్లింపు నత్త నడకన విద్యుత్ రైళ్లు
నత్త నడకన రైళ్లు..
తీవ్ర పొగ మంచు కారణంగా చైన్నెలో విద్యుత్ రైళ్ల సేవలకు ఆటంకం ఏర్పడింది. చెంగల్పట్టు, మూర్ మార్కెట్, ఆవడి, అరక్కోణం, మార్గంలో వేకువజాము నుంచే నడిచే విద్యుత్ రైళ్లు పొగ మంచు కారణంగా లైట్లు వేసుకుని నడిచాయి. పట్టాలు సైతం కనిపించని స్థితి ఏర్పడడంతో వేగం పూర్తిగా తగ్గి నత్తనడకన సాగాయి. రైళ్లు ఆలస్యం కారణంగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment