![వైభవంగా పళని తైపూస ఉత్సవాలు ఆరంభం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06cni03-300102_mr-1738873114-0.jpg.webp?itok=0g7jxbLe)
వైభవంగా పళని తైపూస ఉత్సవాలు ఆరంభం
● ఘనంగా ధ్వజారోహణం
సేలం : పళనిలో తైపూస ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. పళని దండాయుధపాని ఆలయ ఉప ఆలయాలైన పెరియనాయకి అమ్మవారి ఆలయంలో తైపూస ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ధ్వరోహణం నిర్వహించారు. ధ్వజస్తంభ మండపంలో వల్లి, దేవసేన సమేత ముత్తు కుమార స్వామి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు. తర్వాత ధ్వజస్తంభానికి విశేష పూజలు చేసి శివాచార్యులు ధ్వజారోహణం నిర్వహించారు. పది రోజుల పాటూ జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారు రథం వీధిలో బంగారు, వెండి నెమలి, దంతపు పల్లకి, పొట్టేలు, కామధేను వాహనాలపై ఊరేగుతారు. ఉత్సవాలలో 6వ రోజు అయిన ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామి వారికి కల్యాణోత్సవం జరుగుతోంది. 11వ తేదీ సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. అదే విధంగా 14వ తేదీ తెప్పోత్సవం జరుగుతుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు.
తైపూసం 1,320 ప్రత్యేక బస్సులు
సేలం : రాష్ట్రంలో తైపూసం పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో మూడు రోజులు 1,320 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ప్రభుత్వ రవాణా సంస్థ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు.. 7వ తేదీ (శుక్రవారం), 8వ తేదీ (శనివారం), 9వ తేదీ (ఆదివారం) వారాంతరం రోజులు, విశేష ముహూర్తపు రోజులు, తైపూసం సందర్భంగా చైన్నె నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. చైన్నె కిలాంబాక్కం నుంచి తిరువన్నామలై, తిరు చ్చి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్‌కోవిల్, కన్యాకుమారి, తూత్తుకుడి, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, తిరుపూర్ వంటి ప్రాంతాలకు శుక్రవారం 380 బస్సులు నడుస్తాయి. అదేవిధంగా శనివారం 530 బస్సులు నడపాలని నిర్ణయించారు. చైన్నె, కోయంబత్తూరు నుంచి తిరువన్నామలై, నాగై, వేలాంగన్ని, హోసూర్, బెంగళూరు వంటి ప్రాంతాలకు శుక్రవారం రోజు 60 ప్రత్యేక బస్సులు, శనివారం రోజు 60 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బెంగళూరు, తిరుపూర్, ఈరోడ్, కోయంబత్తూరు వంటి ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు ఆదివారం 250 ప్రత్యేక బస్సులను నడిపే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా మాధవరం నుంచి శుక్రవారం 20 బస్సులు, 8వ తేది 20 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అదేవిధంగా ఆదివారం సొంత ఊర్ల నుంచి తిరిగి రావడం కోసం ప్రయాణికుల అవసరానికి తగినట్టు అన్ని ప్రాంతాలలో ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఈ వారం చివరిలో శుక్రవారం 11,336 మంది ప్రయాణికులు, శనివారం 634 ప్రయాణికులు, ఆదివారం 8,864 ప్రయాణికులు బస్సుల్లో రిజర్వేషన్ చేసినట్టు అధికారుల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment