![తిరుపూర్‌లో ప్రైవేటు బస్సు బోల్తా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06cni01-300102_mr-1738873113-0.jpg.webp?itok=JwQHQK80)
తిరుపూర్‌లో ప్రైవేటు బస్సు బోల్తా
● ఇద్దరు కళాశాల విద్యార్థుల సహా
నలుగురి దుర్మరణం
సేలం : తిరుపూర్ నుంచి ఈరోడ్‌కు వెళుతున్న ప్రైవేటు బస్సు లారీని ఓటర్‌టేక్ చేయడానికి యత్నించిన సమయంలో బోల్తా పడింది. తిరుపూర్ కొత్త బస్టాండ్ నుంచి ఈరోడ్ వైపుగా గురువారం ఉదయం 60 మంది ప్రయాణికుల తో ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. ఈ స్థితి లో ఊత్తుకులి సమీపంలోని సెంగపల్లి జాతీయ రహదారిపై ఓ కంటైనర్ వెళుతుండగా, దాన్ని ఓవర్ టేక్ చేయడానికి యత్నించడంతో అదుపుతప్పి బస్సు రోడ్డుపై బోల్తాకొట్టింది.
నలుగురు దుర్మరణం..
ఈ ప్రమాదంలో ఇద్దరు కళాశాల విద్యార్థులతో పాటూ నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మర ణం చెందారు. 40 మంది ప్రయాణికులు గా యాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడి రక్తపు గా యాలతో పోరాడారు. సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రక్షణ బృందం రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించి అంబులెన్స్‌ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి కాళ్లు, చేతులు పూర్తిగా విరిగి పోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు ఈరోడ్ నందా కళాశాలలో చదువుకుంటున్న పెరియసామి (19), హరికృష్ణ (19) కాగా, మరో ఇద్దరి వివరాలు తెలియా ల్సి ఉంది. పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఈ ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఈ ప్రమా దం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కులగణనకు విజయ్ పట్టు
సాక్షి, చైన్నె: తమిళనాడులోను కులగణనకు చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ డిమాండ్ చేశారు. బిహార్, కర్ణాటక తదుపరి తెలంగాణలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కులగణనకు చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ విజయ్ గురువారం ఓ ప్రకటన చేశారు. తమిళనాడులోని ప్రభుత్వం కులగణన కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నదే గానీ, ప్రత్యేకంగా రాష్ట్రంలో దృష్టి పెట్టక పోవ డం శోచనీయమన్నారు. కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద ఆరోపణలు, నిందులు వేయడం కాదని, ఎవరో ఒకరు ముందుగా అధ్యయనానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన తరహాలో తమిళనాడు ప్రభుత్వం ఎందుకు కులగణనకు చొరవ చూపించడం లేదని ప్రశ్నించారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం
–12 జిల్లాల నుంచి పాల్గొన్న యువత
కొరుక్కుపేట: అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఆర్మీకి రిక్రూట్‌మెంట్ క్యాంప్ గురువారం ఉదయం కాంచీపురంలో ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏటా ఆర్మీ రిక్రూట్‌మెంట్ క్యాంపులు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా కాంచీపురంలోని అరిజ్ఞార్ అన్నా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈనెల 9వ తేది వరకు ఈ క్యాంపు జరుగునుండగా, అగ్నివీర్ కార్యక్రమంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న 12 జిల్లాల యువకులు శిబిరంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రా నుంచి కూడా యువకులు హాజరయ్యారు.
ముసాయిదాలపై
నిర్ణయానికి మూడేళ్లా?
– గవర్నర్‌కు సుప్రీంకోర్టు ప్రశ్న
సాక్షి,చైన్నె : ముసాయిదాలపై నిర్ణయం తీసుకునేందుకు మూడేళ్లు సమయమా? అని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రశ్న లు సందించింది. ఇంత కాలం మౌనంగా ఉండవచ్చా? దీనిని ఎలా పరిగణించాలి? అని న్యాయ మూర్తులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య జరుగుతున్న వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ప్రధానంగా వీసీల నియమాకం, వర్సిటీల వ్యవహారం విషయంగా రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. గత విచారణ సమయంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. గురువారం విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోత్హి, అభిషేక్ మను సింఘ్వీ, విల్సన్ న్యాయవాదులు హాజరైన వాదనలు వినిపించారు. అనంతరరం న్యాయమూ ర్తులు స్పందిస్తూ, ముసాయిదాలను అనుమతి కోసం పంపించినప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోకుండా మౌనం వహించడం ఏమిటో? అని అసహనం వ్యక్తం చేశారు. దీనిని ఎలా పరిగణించాలో అని పేర్కొంటూ, మళ్లీ అసెంబ్లీ ఆమోదం పొందిన ముసాయిదాల విషయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రాష్ట్రపతికి పంపించి ఉన్న పక్షంలో దాని స్థితి ఏమిటి? వెనక్కి పంపించి ఉంటే, ఏదేని అభిప్రాయాన్ని గవర్నర్ పేర్కొన్నారా? సూచనలు చేశారా? అన్న ప్రశ్నలను సంధిస్తూ, ముసాయిదాల ఆమోదానికి మూడేళ్లు సమయ మా? అని వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment