హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రెండోరోజు శుక్రవారం వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా చేపట్టిన వార్డు సభలకు ఉదయం నుంచే అధిక సంఖ్యలో జనం విచ్చేసి దరఖాస్తులతో తంటాలు పడ్డారు. వంద కుటుంబాలకు ఒకరుచొప్పున ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని డివిజన్లలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. విమర్శలు తలెత్తకుండా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ ధోత్రే పక్కా ప్రణాళికతో అన్ని కేంద్రాల వద్ద అందుబాటులో దరఖాస్తులను ఉంచారు.
అలాగే తెల్లకాగితం మీద తమ సమస్య రాసిచ్చినా తీసుకోవాలని గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని కేంద్రాల వద్ద జనం బారులు తీరినా దరఖాస్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. సమీప నియోజకవర్గాల పరిధిలో దరఖాస్తు ఫారాలు కలర్‌లో ఉంటేనే తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో అప్పటికప్పుడు అటు జోనల్ కమిషనర్, డీఎంసీ స్పందించి సర్కిల్–17, 18 పరిధిలో ఎవరు కాగితంపై సమస్య రాసిచి్చనా తీసుకోవాలని సూచించారు. చాలా మంది రేషన్ కార్డు కోసం తెల్లకాగితంపై అర్జీలు పెట్టుకున్నారు. దరఖాస్తుల్లో ఎక్కువగా తెల్ల రేషన్ కార్డు కోసమే దరఖాస్తులు వెల్లువెత్తాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్లలో మొత్తం 10 ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సందేహాలతో కుస్తీ పడ్డ జనం...
► ఫారంలో నాలుగు పేజీలు ఉండగా ఎక్కడా లబి్ధదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతా నెంబర్‌ను ప్రస్తావించలేదు. దీంతో చాలా మంది నగదు సహాయం ఎక్కడ జమ చేస్తారు. వాటి వివరాలు ఎక్కడ తీసుకుంటారు అనే అయోమయానికి గురయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అధికారుల నుంచి జవాబు కరువైంది.
► గృహ జ్యోతి పథకంలో యజమాని పేరు విషయంలోనూ చాలా మంది అయోమయానికి గురయ్యారు.
►గ్యాస్ కనెక్షన్ల విషయానికి వస్తే ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి, ఒక వేళ అన్ని కనెక్షన్ల నెంబర్లు వివరాలు ఇస్తే ఒకదానికి రాయితీ వచ్చి మిగిలిని వాటికి రాదేమోనన్న ఆందోళన మహిళల్లో కనిపించింది.
► ఒక ఇంట్లో రెండుకంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లో అద్దెకుంటున్నవారూ ఉన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగానికి రాయితీ ఇందులో ఏ కనెక్షన్‌కు వర్తిస్తుంది అంటూ విధుల్లో ఉన్న ఉద్యోగులను అడగగా తమకేమీ తెలియదని కేవలం దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే జనం చాలా సమస్యలతో సతమతమవుతూ ఆ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్రాల వద్ద ప్రయతి్నంచినా ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో ఏదోఒకటి ఇచి్చపోదామనే ధోరణిలోనే చాలా మంది కనిపించారు.
మొత్తం 14015 దరఖాస్తులు
జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో శుక్రవారం వివిధ పథకాల లబ్ధి కోసం 8628 దరఖాస్తులు వచ్చాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 14015 దరఖాస్తులు వచి్చనట్లు అధికారులు వెల్లడించారు.
పింఛన్ కోసం వచ్చా
ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్ కోసం నాలుగుసార్లు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నాను. మా బస్తీకి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో అభ్యర్ధులు వచి్చనప్పుడు వారి కాళ్లు పట్టుకొని వేడుకున్నా. అయితే ఇప్పటి వరకు పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. పింఛన్‌కు నేను పూర్తి అర్హుడిని అయినాసరే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటూ ఈ సభలు ఏర్పాటు చేయడంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను. ఈ సారైనా మంజూరు అవుతుందనే ఆశతో ఉన్నాను.
– బాలపీరు, దివ్యాంగుడు, అంబేడ్కర్‌నగర్
నేడు ప్రజాపాలన జరగనున్న కేంద్రాలివే...
► బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సీఎంటీసీ బిల్డింగ్‌లో కమాన్ ఎన్బీటీ నగర్ బస్తీవాసులకు..
► బంజారాహిల్స్ రోడ్ నెం. 13లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో వేమిరెడ్డి ఎన్‌క్లేవ్ కాలనీవాసులకు...
► బంజారాహిల్స్ రోడ్ నెం. 12 ఎన్బీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఎన్బీ నగర్ బస్తీవాసులకు.
► ప్రేమ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో భోలానగర్ బస్తీవాసులకు...
► బంజారాహిల్స్ రోడ్ నెం. 7 మీసేవా బిల్డింగ్‌లో సంజయ్ నగర్ బస్తీవాసులకు...
► బంజారాహిల్స్ రోడ్ నెం. 10 ఇబ్రహీంనగర్ కమ్యూనిటీ హాల్‌లో
నూర్‌నగర్ బస్తీవాసులకు.
► పంజగుట్ట ప్రతాప్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో దేవరకొండ బస్తీ వాసులకు...
► గౌరీ శంకర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సింగాడికుంట బస్తీవాసులకు...
► జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ఉన్న వార్డు కార్యాలయంలో ప్రశాసన్‌నగర్ కాలనీవాసులకు.
► భగత్‌సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీవాసులకు...
► జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఇందిరానగర్ బస్తీవాసులకు...
► గౌతంనగర్ కమ్యూనిటీ హాల్‌లో దుర్గా భవానీనగర్ బస్తీవాసులకు.
Comments
Please login to add a commentAdd a comment