● అవస్థల్లో 108, 104 ఉద్యోగులు ● మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం ● దీపావళి పండుగకూ పస్తులేనా?
కాణిపాకం(చిత్తూరు రూరల్): రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా వేధిస్తోంది. ఇప్పుడు చిరుద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలనూ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. అత్యవసర వైద్యసేవలందించే ఆపద్భాందవులకూ జీతాలివ్వకుండా అవస్థల్లోకి నెట్టేసింది. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
పల్లె నాడికి గుండె లాంటిది 104
104 వాహనాల్లో అన్ని రకాల పరీక్షలు చేసేందుకు పరికరాలు ఉన్నాయి. ఈసీజీతో సహా 9 రకాల పరీక్షలు చేస్తారు. మధుమేహం, రక్తపోటు, గుండె, కడుపు, కంటికి సంబంధించిన పరీక్షలు చేస్తుంటారు. అక్కడికక్కడే బాధితులకు 74 రకాల మందులను ఉచితంగా అందిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రతిరోజూ ఈ వాహనాల వద్ద వైద్యులు నిర్వహించే ఓపీకి రోగులు క్యూ కడుతుంటారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు బీపీ, మధుమేహం లాంటి పరీక్షలను ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు వెళ్లి చేయించుకునే పరిస్థితి ఉండదు. ఈనేపథ్యంలో ప్రతి పంచాయతీకి నెలలో రెండు సార్లు వెళ్లి వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటారు. అక్కడే పరీక్షలు చేసి మందులు, మాత్రలు పంపిణీ చేస్తుంటారు.
ఆయుష్షు పోసే బ్రహ్మ 108
అత్యవసర సేవలకు 108 వాహన సేవలు ఆయుష్ పోస్తోంది. జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు కుయ్ కుయ్ మంటూ పరుగులు పెడుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా అత్యవసర ఆరోగ్య సేవలందిస్తున్నాయి. వీటిల్లో పనిచేసే సిబ్బంది జీతభత్యాల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం స్పదించకపోవడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. వెంటనే వారికి వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి జిల్లా సమాచారం
ప్రతి నెలా 108 ద్వారా
అందుతున్న సేవలు
55 వేల మందికి
104 సమాచారం
వాహనాల డ్రైవర్లు డీఈఓలు మేనేజర్
సంఖ్య
39 43 43 1
రెండు రోజుల్లో..
జీతాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జీతాలు బ్యాంకు ఖాతాకు జమవుతాయి. నిధులు వచ్చాయి. ట్రజరీ నుంచి రావాల్సి ఉంది. పెండింగ్ జీతాల విషయంలో అనుమానాలు వద్దు.
–శ్రీహరి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, తిరుపతి
అత్యవసర
సమయాల్లో
5 వేల మందికి
104 ద్వారా
అందుతున్న సేవలు
50 వేల మందికి
Comments
Please login to add a commentAdd a comment