సమీరా వచ్చేస్తున్నా!
సమీరా వచ్చేస్తున్నా.. అంటూ చెప్పిన భర్త తెల్లవారేసరికి విగతజీవిగా కనిపించడం ఆమె ను దుఃఖసాగరంలో ముంచేసింది.
భూమనకు
పెద్దిరెడ్డి అభినందనలు
తిరుపతి మంగళం: చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా భూమన కరుణాకరరెడ్డి నియమితులైన సందర్భంగా మంగళవారం పద్మావతీపురంలోని భూమన నివాసానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా విచ్చేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డికి దుశ్శాలువ కప్పి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఇద్దరూ కొంతసేపు ముచ్చటించారు.
‘పది’ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
తిరుపతి ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజును ఈ నెల 28వ తేదీ నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలని డీఈఓ కేవీఎన్.ప్రసాద్ తెలిపారు. అలాగే ఒకేషనల్, మైగ్రేషన్ సర్టిఫికెట్లకు సైతం ఫీజును ఆ వెబ్‌సైట్‌లోనే చెల్లించాలని సూచించారు. పది పబ్లిక్ పరీక్ష రాసేందుకు వయసు తక్కువ ఉన్న విద్యార్థులు అండర్ ఏజ్ సర్టిఫికెట్ చలనాలను సీఎప్‌ఎంఎస్ ద్వారా ఒక్కొకరికీ రూ.300 చెల్లించి డీఈఓ వద్ద సర్టిఫికెట్ పొందాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లోనూ, అలాగే డీఈఓ కార్యాలయంలోనూ సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment