అదరం.. బెదరం | - | Sakshi
Sakshi News home page

అదరం.. బెదరం

Published Wed, Nov 20 2024 12:26 AM | Last Updated on Wed, Nov 20 2024 12:26 AM

అదరం.. బెదరం

అదరం.. బెదరం

శ్రీరంగరాజపురం: టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు, బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితుల్లో బెదరమని, వైఎస్పార్‌ సీపీ శ్రేణులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. శ్రీరంగరాజుపురం మండలం కొత్తపల్లిమిట్ట గ్రామంలో మంగళవారం నియోజకవర్గం బూత్‌ కన్వీనర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో సృష్టిస్తున్న అల్లర్లు, అరాచకాలు తార స్థాయికి చేరాయన్నారు. టీడీపీ నేతలు అధికార అహంకారంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వరుస దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు రోడ్డుపైకి వస్తే టీడీపీ తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. ఈ తరుణంలో జైలుకు పంపినంత మాత్రాన వైఎస్సార్‌సీపీలో భయపడేవారు ఎవరూ లేరని.. టీడీపీ తప్పులను ఎండగట్టడానికి సమయం దగ్గర పడిందనే విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో కార్యకర్తలంతా మమ్మల్ని జైల్లో వేయండంటూ జైల్‌ భరో కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. సోషియల్‌ మీడియా వేదికగా టీడీపీ అండ్‌ కో వైఎస్సార్‌ కుటుంబంపై చేసిన అభస్యకరమైన పోస్టులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఇక భయపెట్టి అధికారంలోకి కొనసాగాలని చూస్తే..ప్రజలు తిరగబడడం ఖాయమన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు సైతం సమష్టిగా పనిచేసి చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు

తాను పార్టీకి తలొగ్గి పనిచేస్తా

కార్యకర్తలు పోరాట పటిమతో పనిచేయాలి

టీడీపీ కుట్రలకు భయపడొద్దు

వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement