భూసేకరణ వేగవంతం చేయండి
మమ్మల్ని ఆపేదెవడ్రా?
నాయుడుపేటలో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. అడ్డూఅదుపూ లేకుండా ఇసుక దందాకు పాల్పడుతున్నారు.
ఏటీఎంలో చోరీకి యత్నం
నాయుడుపేటలోని ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి యత్నించి విఫలమయ్యాడు. గునపంతో ఏటీఎంను బద్ధలు కొట్టాడు.
● నాట్లు వేసి నిరసన
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024
ప్రాణాలకు తెగించి రోగుల మలినాలను శుభ్రం చేస్తుంటారు. ఆస్పత్రుల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశ్రుభంగా ఉంచేందుకు చెమటలు చిందిస్తుంటారు. అయితే వీరికి అందాల్సిన వేతనాలు మాత్రం సంబంధిత కాంట్రాక్టర్ దిగమింగేస్తున్నారు. అరకొర సిబ్బందిని నియమించి నిత్యం వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ప్రతి నెలా పీఎఫ్ డబ్బులను సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేసేస్తున్నారు. ప్రశ్నించిన కార్మిక వర్గాల మధ్య అగ్గి రాజేసి చలికాసుకుంటున్నారు. అక్రమార్జనలో వాటాలందుకుంటున్న అధికారులు శ్రమదోపిడీకి తమ వంతు సహకారం అందిస్తున్నారు. పేదల పెద్దాస్పత్రిగా పేరుగాంచిన తిరుపతి రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న నిరంకుశ దందాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..!
వేతనాలు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులు
20 ఏళ్లుగా ఎప్పుడూ ఇలా లేదు
నేను మెటర్నిటీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను, జీతాల విష యంలో మాకు ఇప్పు డు జరుగుతున్న అన్యా యం గతంలో ఎప్పు డూ జరగలేదు. జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, మాకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మునిరాజమ్మ, వర్కర్,
మెటర్నిటీ ఆస్పత్రి
మూడేళ్లుగా పీఎఫ్ లేదు
నిత్యం మలినాలను శుభ్రం చేస్తున్న మా డబ్బులు కొట్టేస్తున్న కాంట్రాక్టు సంస్థ సర్వనాశనం అయిపోతుంది. చెత్త తోసుకునే మా డబ్బులు తినడం దుర్మార్గం. మూడేళ్లుగా మా నుంచి పీఎఫ్‌ను వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాకు తిరిగి చెల్లించలేదు. ఏ వన్ సర్వీసెస్ సంస్థ ప్రభుత్వం మాకిచ్చిన వేతనాల నుంచి రూ.కోట్లు దండుకొంటోంది. సగం మందితో పనులు చేయిస్తుండడంతో మాపై పని భారం పడుతోంది.
–కే లక్ష్మి వర్కర్, మెటర్నిటీ ఆస్పత్రి
నిరవధిక సమ్మె తప్పదు
కార్మికుల కడుపు కొడుతున్న కాంట్రాక్టు సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. రుయా, మెటర్నటీ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ నిబంధనలు అమలు కావడం లేదు. కనీస వేతనాలు, ప్రతినెలా జీతాలు చెల్లింపు, పూర్తిస్థాయిలో వర్కర్ల నియామకం వంటివి జరగడం లేదు. ఈనెల చివరకల్లా నాలుగు నెలల వేతనాలు చెల్లించని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతాం అధికారులతో పాటు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాం.
–మహేంద్ర, మెడికల్ కాంట్రాక్ట్
వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
ఆగమోక్తంగా ఆకాశదీపం
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం ఆకాదీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ ఆకాశదీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగిస్తుంటారు. ఆలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా ఎగురవేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దర్శించుకున్నారు.
పది పరీక్ష ఫీజు గడువు
పొడిగింపు
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు, నామినల్ రోల్స్ సమర్పించేందుకు ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్ర విద్యాశాఖ గడువు పొడిగించినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 10 నుంచి 16వ తేదీ వరకు చెల్లించవచ్చని డీఈఓ పేర్కొన్నారు.
కనీస వేతనాలు ఇవ్వండి
తిరుపతి సిటీ: ఎస్వీయూలో పనిచేస్తున్న ఎన్‌ఎమ్‌ఆర్, డైలీ వేజ్ ఉద్యోగులకు కనీస జీతాలు అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వర్సిటీ అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం వీసీ సీహెచ్.అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, వర్సిటీ ప్రిన్సిపాళ్లు, వర్సిటీ ఫైనాన్స్ అధికారి, నాన్ టీచింగ్ అధికారులు కలెక్టర్ ఆదేశాలపై చర్చించి ‘మినిమం వేజ్’ అమలు చేసి, జీతాలు పెంచాలని నిర్ణయించారు. దీంతో ఎన్‌ఎంఆర్, డైలీ వేజ్ ఉద్యోగులకు సుమారుగా నెలకు రూ.వెయ్యి వేతనాలు పెరగనున్నాయి. పెంచిన వేతనాలు 2024 ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నట్లు తెలిస్తోంది. దీంతో సుమారు రూ.7 వేల అరియర్స్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మినిమం వేజ్ అమలు చేయడంపై ఆదేశాలు జారీచేసిన కలెక్టర్, వర్సిటీ అధికారులకు తాత్కాలిక ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ్ అవార్డుకు అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌డీఓ సయ్యద్ సాహెబ్ తెలిపారు. క్రీడాకారులకు కేంద్రం అందించే మేజర్ ధ్యాన్‌చంద్, ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఖేల్ ప్రోత్సాహ్ అవార్డును కేంద్రం ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ‘డీబీటీవైఏఎస్.ఎస్‌పీఓఆర్‌టీఎస్.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు డీఎస్‌డీఓ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు
● కాంట్రాక్టర్ చెప్పుచేతల్లో నలిగిపోతున్న సిబ్బంది
● రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల్లో
అరకొర సిబ్బందితోనే విధులు
● ప్రశ్నించిన వారిపై వేధింపులు
● కార్మిక వర్గాల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్న కాంట్రాక్టర్
● పీఎఫ్ డబ్బులు సైతం జమచేయని సంస్థ
● వాటాలందడంతో చూసీ చూడనట్లు
వదిలేస్తున్న అధికారులు
తిరుపతి తుడా : నగరంలోని రుయా ఆస్పత్రి 1,100 బెడ్ల సామర్థ్యంతో పేద రోగులకు వైద్య సేవలందిస్తోంది. అయితే ఇక్కడ పారిశుద్ధ్యం పడకేసింది. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడమే ఇందుకు కారణం. ఆస్పత్రిలో కాంట్రాక్టర్ పారిశుద్ధ్య నిర్వహణకు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కార్మికులను నియమించకపోగా అరకొరగా పనికి పెట్టుకున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో భారీ కోతలు విధించి, వారి కడుపు కొడుతున్నారు.
రుయాలో మరీ దారుణం
రుయా ఆస్పత్రిలో బెడ్ల సామర్థ్యం ప్రకారం 204 మందితో పనులు చేయించేలా ప్రభుత్వంతో కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే సదరు కాంట్రాక్టు సంస్థ కేవలం 110 మందితో పనులు చేయించి, 204 మంది వేతనాలను రాబడుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. రుయాలో పారిశుద్ధ్య నిర్వహణకు ఏడాదికి రూ.6.6 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో సగానికి పైగా పనులు చేయించకుండానే కాంట్రాక్టు సంస్థ మింగేస్తోంది. కార్మికులకు ప్రభుత్వ జీఓ ప్రకారం రూ.18 వేలు చెల్లించాల్సి ఉన్నా రూ.12 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదు. నాలుగు నెలలు వేతనాలు కాంట్రాక్టు సంస్థ దగ్గర ఉంచుకుని, కార్మికులను నోరెత్తకుండా చేస్తోంది. ఈ విషయం ప్రశ్నించే వారికి సరిగ్గా విధులు కేటాయించకుండా వేధిస్తోంది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా కాంట్రాక్టు సంస్థ ఉసిగొల్పుతోంది. అయితే కాంట్రాక్ట్ సంస్థకు చట్టబద్ధంగా పారిశుద్ధ్య నిర్వహణ నిధులు పూర్తి స్థాయిలో వచ్చేందుకు ఆస్పత్రి అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మూడేళ్లుగా పీఎఫ్ పేరుతో కార్మికుల వేతనాల్లో కోత విధిస్తూ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా కాంట్రాక్టు సంస్థ స్వాహా చేసింది.
కలెక్టర్ దగ్గరే తీసుకోమంటున్నారు
జీతాలు ఇవ్వలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తారా?. అయితే కలెక్టర్ దగ్గరికే వెళ్లి ప్రతి నెలా జీతాలు తీసుకోండంటూ మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. ఎప్పుడూ నాలుగు నెలల జీతం వారి వద్ద ఉంచుకుని ఆపై నెల నుంచి మాత్రమే ఇస్తున్నారు. అధికారుల వద్దకు వెళితే ఇక అప్పటి నుంచి డ్యూటీలు ఇవ్వరు. మీ వల్ల ఏమైతే అది చేసుకోండి ఎక్కడికి వెళతారో వెళ్లడని మాపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు.
– అనురాధ, వర్కర్, రుయా ఆస్పత్రి
గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు
తక్కువ మందితో పనులు చేయించుకుంటున్నారు. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. వర్కర్‌గా మాకు గుర్తింపు ఇవ్వడం లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అడిగితే తప్ప నెలల తరబడి జీతాలు ఇవ్వరు. ఫలితంగా మా బతుకులు అధ్వానంగా మారుతున్నాయి. బతకడం కష్టమవుతోంది. ప్రభుత్వం స్పందించి కార్మికులను మోసం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. – నాగజ్యోతమ్మ, వర్కర్, మెటర్నిటీ ఆస్పత్రి
ఇంటి అద్దె కట్టలేకున్నాం
నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి అద్దె కూడా కట్టలేకున్నాం. ఈ జీతాలను నమ్ముకుని పూర్తిగా అప్పుల పాలైపోయాం. మా బాధలు పట్టించుకునే వారు లేరు. కనీస వేతనాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటివి ఏవైనా అడిగితే దాడులు చేయిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక మేము మిన్నకుండి పోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పుడైనా పట్టించుకుని మాకు న్యాయం చేయాలి. – రమణమ్మ, వర్కర్, రుయా ఆస్పత్రి
‘మేం అధికారంలోకి వస్తే రోడ్లను అద్దాల్లా మెరిపిస్తాం.. గతుకులు బొతుకులు లేకుండా చూడముచ్చటగా తీర్చిదిద్దుతాం..’ అంటూ ఎన్నికల్లో జబ్బలు చరిచిన కూటమి నేతలు అధికారం వచ్చాక చేతులెత్తేశారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కనీసం గుంతలు కూడా పూడ్చిన దాఖలాలు లేవు. దొరవారిసత్రం మండలం, కల్లూరు గ్రామంలో నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు వీధులు జలమయమయ్యాయి. వీటికి మట్టి తోలి బాగు చేయాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు, మహిళలు మంగళవారం వీధుల్లో నాట్లు వేసి నిరసన తెలిపారు. – దొరవారిసత్రం
తిరుపతి అర్బన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జేసీ శుభం బన్సల్‌తోపాటు జాతీయ రహదారుల పీడీలు, రైల్వే, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. భూసేకరణలో సమస్యలుంటే తమకు తెలియజేస్తే వాటికి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ రహదారుల నిర్మాణంలో పురోగతి చూపాలని పీడీలను ఆదేశించారు. కాలూరు– పీలేరు, రేణిగుంట –నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటకు సంబంధించిన సాగరమాల రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.
పర్యాటక అభివృద్ధికి భూసేకరణ
పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి అవసరమైన మేరకు భూసేకరణ చేపట్టాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. తిరుపతి నగరంతోపాటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ పరిధిలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి అంతా సహకరించాలని సూచించారు. తిరుపతి నగరపాలక కమిషనర్ నారపురెడ్డి మౌర్య, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్ పాల్గొన్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఎఫ్‌ఆర్‌ఎస్‌కే మస్కా
ఉద్యోగులు, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్)ను తీసుకొచ్చింది. అయితే కాంట్రాక్టర్ ఏకంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌కే మస్కా కొట్టిస్తున్నాడు. రోజూ ఎఫ్‌ఆర్‌ఎస్ వేయించేందుకు కొంతమందిని ఏర్పాటు చేయించాడు. వీరు రోజూ రెండు సార్లు ఎఫ్‌ఆర్‌ఎస్ వేసి వెళ్లిపోతుంటారు. ఇందుకు వారికి ప్రతినెలా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెబుతున్నారు. ఇలా అక్రమంగా ఎఫ్‌ఆర్‌ఎస్ వేయించేందు కు 70 మంది వరకు బయట వ్యక్తులు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తమ వాటా తమకు వస్తుండడంతో అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
నాలుగు నెలలుగా అందని వేతనాలు
తిరుపతి మెటర్నటీ ఆస్పత్రిలో 60 మంది పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించాలని ప్రభుత్వంతో ఏవన్ సర్వీస్ కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కాంట్రాక్టర్ 30 మంది కార్మికులతోనే నెట్టుకొస్తూ.. 60 మంది వేతనాలను మంజూరు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. నిబంధనల మేరకు ఒక్కొక్క కార్మికుడికి నెలకు రూ.18 వేలు వేతనం అందాల్సి ఉన్నా ఆ నిబంధన అమలు కావడం లేదు. పీఎఫ్ పేరుతో నెలనెలా ఒక్కొక్కరి నుంచి రూ.2 వేలు కోత విధిస్తున్నా ఆ మొత్తం కార్మికులకు చేరడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment