రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
రామచంద్రాపురం: మండలంలోని నెత్తకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి, చిత్తూరు జిల్లా అండర్–14 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ఎంఈఓ జయవేలు, తిరుపతి జిల్లా స్కూల్ ఫెడరేషన్ సంస్థ కార్యదర్శి బాబు, హెచ్‌ఎం తులసి కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా స్కూల్ ఫెడరేషన్ సంస్థ కార్యదర్శి బాబు మాట్లాడతూ జిల్లా స్థాయి అండర్–14 త్రోబాల్ పోటీలలో 12 మంది బాలురు, 12 బాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వెల్లడించారు. వీరిలో అండర్–14 బాలికల విభాగంలో భానుశ్రీ (సోమల, కందూరు), సుకన్య (నగరి), పద్మశ్రీ(సదుమూరు, కుప్పం), వర్షణ (పీసీఆర్, చిత్తూరు), వాణి (పంగూరు, ఏర్పేడు), చాందిని(పంగూరు, ఏర్పేడు), అనన్య (సోమల), దిశాలినీ (నెత్తకుప్పం), అక్షర(సోమల), వసంతిక (కందూరు), రాణి(పెద్ద కనపర్తి),గౌరీప్రియ (పూతలపట్టు), బాలు ర విభాగంలో వసంత్‌కుమార్ (ఏకాంబరకుప్పం), గురులోకేష్ (పెద్ద కనపర్తి), మహమ్మద్ సయ్యద్ (చీనేపల్లి, ఉర్దూ స్కూల్), చరణ్‌తేజ్ (సోమల), రోహిత్ (మొగరాల), రేవంత్ (కందూరు), భువనేష్ (సదమూరు), తులసీరాం (పంగూరు), జహీర్ (రొంపిచెర్ల), కుశ్వంత్ (నెత్తకుప్పం), ప్రణీత్ (పీసీఆర్, చిత్తూరు), నితీష్ (పూతలపట్టు) ఉన్నట్లు తెలిపారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో పీడీలు సుబ్రమణ్యంరెడ్డి, గోపీనాథ్, చిన్నప్ప, కరుణానిధి, లోకేష్, భవానీ, భార్గవి, దేవరాజులు, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment