రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
నాయుడుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందగా.. ముగ్గురు గాయపడిన ఘటన మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. చైన్నై వైపు నుంచి నెల్లూరుకు వెళుతున్న లారీ గురువారం తెల్లవారు జామున 1.30 ప్రాంతంలో టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో పంచర్ వేసేందుకు డ్రైవర్ లారీ టైర్ తీస్తున్నాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. టైర్ విప్పుతున్న డ్రైవర్ పఠాన్ ముత్తుజా ఖాన్(58) లారీ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. హైవేపై విధులు నిర్వహిస్తున్న సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, హైవే మొబైల్ పోలీసులు స్థానిక ఏఎస్ఐ ధర్మయ్యతో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మార్కాపురం పాంతానికి చెందినలారీ క్లీనర్ జగన్, ఢీకొన్న లారీలో ఉన్న గూడూరుకు చెందిన డ్రైవర్ అహమ్మద్ రఫీ, కావాలి ప్రాంతానికి చెందిన క్లీనర్ వెంకటేశర్లును ౖస్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చరీకి తరలించారు. రహదారిపై నిలిచి పోయిన లారీలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment