బాల్యవివాహాలు ఆందోళనకరం
తిరుపతి రూరల్: జిల్లాలో బాల్య వివాహాలు పెరగడం ఆందోళనకరంగా ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జెండార్ ఆధారిత హింసకు వ్యతిరేఖంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం జిల్లా మహిళా సమఖ్య ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 27 శాతానికి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల 26 శాతానికి పైగా టీనేజ్ ప్రెగ్నన్సీ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే పులివర్తినాని, రూరల్ ఎంపీపీ వేముల యశోద, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఎంపీడీఓ రామచంద్ర, డీఎస్పీ శ్రీలత, ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి పాల్గొన్నారు.
అడిషనల్ ఈఓ తనిఖీలు
తిరుమల: తిరుమలలోని హెచ్‌టీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈఓ సిహెచ్.వెంకయ్యచౌదరి సోమవారం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం రామ్ భగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్నప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 74 ఫిర్యాదులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు సోమవారం 74 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు వెల్లడించారు. వెంటనే సంబంధిత ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,737 మంది స్వామివారిని దర్శించుకోగా 23,208 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment