కొడుకుల వలసతో ఒంటరినయ్యాను
నాకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు జీవనోపాధికి బెంగ ళూరుకు వలస వెళ్లారు. ఉన్న ఒక కొడుకు వడ్డీ వ్యా పారుల బారీన పడి ఉన్న భూమిని అమ్ముకుని వలస వెళ్లిపోయాడు. నేను ఒంటరిని అయ్యాను. భూమి పోయింది. కొడుకు వెళ్లిపోయాడు. ఈ వయసులో నేనేం చేయాలి (కన్నీళ్లు పెట్టుకుంటూ). ఎవరైనా దేవుడు మా వాళ్లకు మంచి చేస్తే బాగుండు.
– మలప్ప, ఊరునాయునిపల్లి, కుప్పం మండలం
నేనూ బాధితుడినే..
నేను కూడా వడ్డీ వ్యాపా రుల బాధితుడినే. అవసరం ఆధారంగా రూ.15 వడ్డీ వసూలు చేస్తున్నారు. గంట ఆలస్యమైనా బూతులు తిట్టడం, దౌర్జన్యాలు చేస్తున్నారు. గ్రామంలో చులకనగా మాట్లాడడం, పని దగ్గరకు వచ్చి యజమానికి చాడీలు చెబుతున్నారు. ఏమి చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం అయినా ఆదుకుని, వడ్డీ వ్యాపారుల భారీ నుంచి కాపాడాలి.
– రంజిత్, ఊరునాయునిపల్లి, కుప్పం మండలం
అవసరాన్ని ఆసరాగా చేసుకుని..
మా ఊళ్లో అందరు పేద లే. కూలి పనులు చేసుకుంటే గానీ కుటుంబాలు గడవ వు. ఏ అవసరం వచ్చినా వడ్డీ వ్యాపారులే గుర్తుకు వస్తారు. అవసరానికి ఎక్కు వ వడ్డీ అయినా తీసుకుంటున్నారు. వీరి ఆసరాన్ని ఆసరాగా చేసుకుని, వడ్డీ వ్యాపారులు నెలా, పదిహేను రోజులకొకసారి రూ.5 నుంచి రూ.15కు పైగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆలస్యమైతే దాడులకు దిగుతున్నారు. చేసేది లేక ఇంటి సామగ్రి, ఽఉన్న అరకొర ధాన్యాలు అమ్ముకోవాల్సి వస్తోంది. – గోవిందు,
ఊరునాయునిపల్లి, కుప్పం మండలం
●
Comments
Please login to add a commentAdd a comment