సరిహద్దు గ్రామాలు గజగజ
చిన్నగొట్టిగల్లు మండలంలోని సరిహద్దు గ్రామాలు గజరాజులతో గజగజలాడుతున్నాయి.
కుప్పం మండలంలోని గుడ్లనాయనపల్లి పంచాయతీలో ఊరునాయునిపల్లి, ఊరునాయునికొత్తూరు అటవీ గ్రామాలున్నాయి. ఊరునాయునిపల్లిలో 140 గృహాలకు గాను 845 మంది, ఊరునాయునికొత్తూరులో 80 కుటుంబాలకు 450 మంది జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ రెండు గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలేవి. మహిళలు బహిష్టులు అయితే గ్రామానికి దూరంగా ఉండడం, గ్రామాల్లో చెప్పులు లేకుండా తిరగడం తదితర ఆనవాయితీలు ఈ పల్లెల్లో ఉండేవి. ప్రభుత్వా లు, కొంత మంది సామాజికవేత్తల కృషితో ఇప్పుడిప్పుడే నాగరిక ప్రపంచంలోకి అడుగులు వేస్తోంది. ఇంతలోనే వీరిని వడ్డీ వ్యాపారులనే మ హమ్మారి చిదిమేస్తోంది. ఈ రెండు గ్రామాల్లో మొ త్తం 220 కుటుంబాలు దాదాపుగా కూలీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏ అవసరం వచ్చినా డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్సి ఉంది. వేరే ఆదరవు లేదు. కూతురుకు పెళ్లి చేయాలన్నా, ఏదైనా పంటలకు పెట్టుబడి కావాలన్నా.. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల న్నా వడ్డీ వ్యాపారులే దిక్కు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు రూ.5 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తూ వారిని అప్పుల పాలు చేస్తున్నారు. కొంత మంది అయితే ఈ వడ్డీని సైతం 15 రోజులకోసారి వసూలు చేస్తూ జనం రక్తాన్ని పీలుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం గంట ఆలస్యమైనా వడ్డీ వ్యాపారులు వారి మనుషులతో వచ్చి దాడులకు దిగుతున్నారు. చేసేది లేక ఇళ్లు లేనివారు వంట పాత్రలు, బిందెలు తెచ్చి వారికిచ్చి మరీ వడ్డీలు చెల్లిస్తున్నారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment