క్రీడా నిధులు చెప్పండి?
● పార్లమెంట్‌లో గళమెత్తిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం: గ్రామీణ క్రీడా కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు తిరుపతి పార్లమెంటు పరిధిలో గత మూడేళ్లలో ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా కేటా యించిన నిధుల వివరాలు తెలపాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశా రు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర యువజన, క్రీడా శాఖా మంత్రి మన్షుక్ మాండవీయ స్పందిస్తూ దేశవ్యాప్తంగా క్రీడలలో నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. నిధుల విషయానికి వస్తే 2021– 22, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలలో వరుసగా రూ.869, రూ.600, రూ.880 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
పాఠశాలల దుస్థితి పట్టదా?
సైదాపురం: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం మండలం, కలిచేడు, తలుపూరు గ్రామాలలో మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఎం.ఎం.ఎల్.డబ్ల్యూ.ఓ) పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖా మంత్రి మన్షుక్ మాండవీయకు ఎంపీ వివరించారు. పాఠశాల భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలన్నారు. ఆ లోపు తరగతుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.
గురుమూర్తి, తిరుపతి ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment