నూతన భవనం.. అధునాతన వైద్యం | - | Sakshi
Sakshi News home page

నూతన భవనం.. అధునాతన వైద్యం

Published Sat, Sep 28 2024 11:24 AM | Last Updated on Sat, Sep 28 2024 11:24 AM

-

మోమిన్‌పేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు బయటి రోగులు 120నుంచి 150వరకు వస్తున్నారు. సీజనల్‌ జ్వరంతో భాదపడుతున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. వెంటనే రక్తపరీక్ష చేసి అవసరమైన మందులు ఇస్తున్నారు. టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ముగ్గురు ఉండాల్సిన వైద్యులలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 5గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారని రోగులు తెలిపారు. ఇజ్రాచిట్టంపల్లికి నుంచి వచ్చిన రోగులు సంగీత, రుక్కిభాయిలకు టైఫాయిడ్‌ రావడంతో ఇక్కడే చికిత్స చేశారన్నారు. సైలెన్‌లు పెట్టారని చెప్పారు. డాక్టరులు బాగానే చూస్తున్నారన్నారు. నూతన భవనం కావడంతో అన్ని రకాల వసతులు కల్పించారు.

విధుల్లో ఒక్కరే..

కుల్కచర్ల: సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నందున రోగులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. రోజు సుమారుగా 80మందికి పైగా ఓపీ చెకప్‌నకు వస్తున్నారు. సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో 120మందికిపైగా వస్తున్నారు. ప్రస్తుతం కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. మరొక మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు ఖాళీగా ఉంది. రాత్రి ఏఏన్‌ఎం మాత్రమే ఉంటున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఒకింత ఇబ్బంది పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement