కొడంగల్: మండలంలో చేపట్టబోయే ఇంటింటి కుటుంబ సర్వేపై ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు సోమవారం అవగాహన కల్పించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్, మండల సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ, ఎంఈఓ రాంరెడ్డి సర్వే సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు. సర్వేను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో భాగంగా ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిర్దేశిత నమూనాలో తప్పులు లేకుండా వివరాలు పొందుపర్చాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలను వివరంగా తీసుకోవాలన్నారు. పారదర్శకంగా జవాబుదారీగా అన్ని అంశాలను నమోదు చేయాలన్నారు. తప్పిదాలకు తావులేకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment