సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కృషి
తాండూరు: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్‌పాటిల్ అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి ఇరు రాష్ట్రాల సరిహద్దులోని నవాంద్గి – హల్కోడ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థానన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడారు. రెండు రాష్ట్రాల సహకారంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు బాల్‌రెడ్డి, మాధవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షరాలు శోభరాణి, నాయకులు డాక్టర్. సంపత్‌కుమార్, వెంకటేష్, నరేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక మంత్రి శరణు ప్రకాష్ పాటిల్
నవాంద్గి – హల్కోడ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment