యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సొంత ఖర్చులతో తలుపు, కిటికీలకు నెట్ అమర్చిన వార్డెన్
యాలాల: మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో అధ్వాన స్థితికి చేరిన తలుపు లు, కిటికీలకు మరమ్మతులు చేయించారు. శనివారం సాక్షి దినపత్రికలో చలి పంజా.. విద్యార్థుల గజగజ శీర్షికన ప్రచురితమైన కథనానికి బాలుర వసతి గృహ వార్డెన్ బాలరాజు స్పందించారు. సొంత డబ్బు ఖర్చు చేసి విరిగిన తలుపు స్థానంలో కొత్తది ఏర్పాటు చేయించారు. దెబ్బతిన్న కిటికీలకు నెట్ ఏర్పాటు చేయించారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిందని వార్డెన్ బాలరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment