జీవన ప్రమాణాల మెరుగుకే సర్వే
అనంతగిరి: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్‌లో నిర్వహించిన సర్వేలో ఎన్యుమరేటర్‌కు తన కుటుంబ సమాచారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. పేద వర్గాలకు ఇది మేలు చేస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో 86శాతం సర్వే పూర్తయిందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తాం
పర్యాటకులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అనంతగిరి అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తామని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం అనంతగిరి అటవీ ప్రాంతం ఘాట్ రోడ్డులోని నంది విగ్రహం వద్ద అర్బన్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ క్వార్టర్‌ను కలెక్టర్ ప్రతీక్‌జైన్, అటవీశాఖ చార్మినార్ జోన్ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి భగవంతుడి ప్రసాదం అని, అందమైన ప్రదేశమన్నారు. అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 200 ఎకరాల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అనంతగిరి గుట్ట అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవస రాద్దాంతం చేస్తున్నాయని అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, ముత్తాహార్ షరీఫ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment