పెన్షన్ పెంపు హామీని అమలు చేయండి
అనంతగిరి: తమ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు శ్యాప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పెన్షన్ల పెంపును వెంటనే అమలు చేయాలని కోరుతూ 6 రోజులుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ అమలు చేయకుంటే 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. నిరాహార దీక్షలో రాష్ట్ర నాయకులు విజయ్‌కుమార్, రాజు, సత్యనారాయణరెడ్డి, జయశ్రీ, దేవదాసు, మల్లేశం, అనంతయ్య, యాదప్ప, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ సంబురాలు
అనంతగిరి: మహారాష్ట్రలో బీజేపీ గెలుపుతో వికారాబాద్‌లో శనివారం ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన
భోజనం అందించాలి
డీఈఓ రేణుకాదేవి
పరిగి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ రేణుకాదేవి ఆదేశించారు. శనివారం పరిగి పట్టణంలోని నంబర్ 1, నంబర్ 2 ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసి తరగతి గదుల్లో పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంట ఏజెన్సీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లలను త్వరలోనే జమ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ పాఠశాలల్లో నెలకొన్న మరుగుదొడ్లు, డ్రైనేజీ, కిచెన్ షెడ్ సమస్యలను డీఈఓకు వివరించారు. స్పందించిన ఆమె సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, ప్రధానోపాధ్యాయులు శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల్లో
పురోగతి ఉండాలి
డీసీపీ శ్రీనివాస్
చేవెళ్ల: పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల్లో వేగవంతమైన పురోగతి ఉండాలని డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ఏసీపీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశమై పోలీస్‌స్టేషన్ల వారీగా కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేవెళ్ల ఏసీపీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయం పరిసరాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నాయని అభినందించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ బి.కిషన్, ఇన్‌స్పెక్టర్లు భూపాల్ శ్రీధర్, పవన్‌కుమార్‌రెడ్డి, కాంతారెడ్డి, డీఐ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌నాయుడు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment