ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ
యాలాల: మండల పరిధిలోని ముద్దాయిపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బందిని అడిగి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో వ్యవసాయ అధికారులు జారీ చేస్తున్న టోకెన్లు, ధాన్యం తేమ శాతం, గన్నీ బ్యాగుల వివరాలు తెలుసుకున్నారు. ధాన్యాన్ని కేంద్రంలో నిల్వ ఉంచకుండా వెంటనే తూకం వేసి బిల్లులు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ శ్రీనివాస్, ఏఈఓ శిరీష, ఐకేపి సిబ్బంది ఉన్నారు.
మధ్యాహ్న భోజన పరిశీలన
బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పంపిణీలో మెనూ తప్పక పాటించాలని నిర్వాహకులు సూచించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు బాకారం చంద్రశేఖర్, అనిల్‌కుమార్, వెంకటయ్య, మల్లయ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment