ఎన్నికల హామీల అమలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీల అమలు

Published Sun, Nov 24 2024 4:00 PM | Last Updated on Sun, Nov 24 2024 4:00 PM

ఎన్నికల హామీల అమలు

ఎన్నికల హామీల అమలు

బషీరాబాద్‌: నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అననారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో 54 మంది లబ్ధిదారులకు రూ.54,06,264 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, తొమ్మిది మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే రూ.18వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. దేశంలో బీసీ కులగణన చేపట్టిన రాష్ట్రం మనదే అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాధవరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చందర్‌, నాయకులు వెంకటేష్‌ మహరాజ్‌, మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కలాల్‌ నర్సింలు, లక్ష్మణరావు, రామ్‌నాయక్‌, మాణిక్‌రావు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

పరామర్శ

యాలాల: మండల పరిధిలోని బెన్నూరుకు చెందిన ప్రైవేటు లెక్చరర్‌ గోవర్థన్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాని అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు అమృతప్ప, మాజీ సర్పంచ్‌ హన్మంతు తదితరులు ఉన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement