షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఆలయంలోని శివలింగాన్ని చోరీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు సుభాష్ డిమాండ్ చేశారు. బసవన్న దేవాలయంలో శివలింగం చోరీ ఘటనపై శనివారం భజరంగ్‌దళ్ పిలుపు మేరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ వాహిని, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఫరూఖ్‌నగర్ నుంచి పట్టణ ముఖ్యకూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేపట్టిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. నిరసనకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో హిందూ సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలింగం చోరీ జరిగి రెండు రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను గుర్తించలేకపోయారని అన్నారు. అనంతరం కొత్తకోట ధర్మశాస్త్ర పీఠాధిపతి శివానందస్వామి మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. అనంతరం వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. ఆలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను గుర్తించకుండా హిందువులపైనే ఆంక్షలను పెట్టడం సరికాదన్నారు. హిందూ దేవాలయాలను కాపాడుకునేందుకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఎంతరవకు సమంజసమని ప్రశ్నించారు. శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రుషికేష్, శివ, అశోక్, వంశీ, మురళి, రమేష్, వంశీ, విజయ్, వినయ్, శివానంద్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
శివలింగం చోరీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు సుభాష్
హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment