నేడు ఆఖరు
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
8లోu
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య
నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ట్రాన్స్ జెండర్స్
పరిగి 1,34,482 1,34,092 09
వికారాబాద్ 1,15,531 1,17,339 14
తాండూరు 1,19,081 1,26,853 07
కొడంగల్ 1,19,585 1,23,860 05
వికారాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటరు తుది జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి గత నెల డ్రాప్ట్ నోటిఫికేషన్(ముసాయిదా ఓటరు జాబితా)ను విడుదల చేసింది. ప్రస్తుతం ఓటరు జాబితా 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం తీసుకుంటే ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ నాలుగు స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌ను ప్రకటించగా నేటి(ఆదివారం)తో ఈ ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. జనవరి 6న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఓటరు జాబితాతో పోలిస్తే ప్రస్తుతం భారీగా ఓట్లు పెరిగాయి. ఓటరు నమోదుకు మరో ఐదు రోజుల గడువు ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది.
భారీగా పెరిగిన ఓటర్లు
జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది జిల్లాలో 9,34,523 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 56,335 మంది పెరిగారు.. గత నెల అధికారులు విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో 9,90,858 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 4,88,679 మంది పురుష ఓటర్లు, 5,02,144 మంది మహిళా ఓటర్లు, 35 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,465 మంది అధికంగా ఉన్నారు.
28 వరకు ఓటరు నమోదుకు అవకాశం
జిల్లాలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 28వ తేదీ వరకు అవకాఽశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏటా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన తర్వాత కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇవ్వడంతో పాటు చనిపోయిన వారి పేర్లు, నివాసం మారిన వారి పేర్లను తొలగిస్తూ వస్తోంది. అలాగే పేర్ల సవరణకు.. ఓటును మరో చోటికి మార్చుకునేందుకు అవకాఽశం ఇస్తోంది. ఇందులో భాగంగా నాలుగు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించగా నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి జనవరి 6న ఓటరు తుది జాబితాను ప్రకటించనున్నారు. జనవరి ఒకటి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన గరుడ యాప్ ద్వారా కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దౌల్తాబాద్‌లో ఎన్నికల సిబ్బందికి సూచనలు చేస్తున్న అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
న్యూస్‌రీల్
నేటితో ముగియనున్న ఓటరు స్పెషల్ క్యాంపెయిన్
ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల
జిల్లాలో మొత్తం ఓటర్లు 9,90,858
జనవరి 6న తుది జాబితా
సద్వినియోగం చేసుకోవాలి
ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశాం. ఈ జాబితాను రాజకీయ పార్టీల నాయకులు పరిశీలించాలి. వారి నుంచి అభ్యంతరాలు, ఆక్షేపణలు తీసుకున్నాం. ఓటరు నమోదుకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. జనవరి 6న తది జాబితాను విడదల చేస్తాం.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment