కీసర: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లి –చర్లపల్లి రహదారిలో చోటు చేసుకుంది. కీసర సీఐ వెంకటయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంపల్లికి చెందిన అంకర్ల శివకుమార్ ముదిరాజ్(29) చర్లపల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి డ్యూటీ నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వెళుతుండగా మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రాంపల్లి –చర్లపల్లి రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా సదరు కాంట్రాక్టర్ మృతుడి కుటుంబానికి రూ 6 లక్షలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment