బైక్ అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొని
చేవెళ్ల: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి త్రీవంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ బస్‌స్టేజీకి సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ పట్టణానికి చెందిన డప్పు అనంతయ్య(50) బైక్‌పై వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం చేవెళ్ల వైపు వచ్చి రాత్రి తిరిగి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మల్లారెడ్డిగూడ బస్‌స్టేజీకి సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment