జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కేశంపేట: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జీపీ వర్కర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జీపీ కార్మికులు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,790 పంచాయతీల పరిధిలో 60వేల మంది కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. 500 జనాభాకు ఒక్క కార్మికుడి పేరును ఆన్‌లైన్‌లో అధికారులు ఎంట్రీ చేశారని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న ప్రతి ఒక్కరినీ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. పని చేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, జీఓ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అర్హులైన కార్మికులను బిల్ కలెక్టర్లు, కారోబార్లు, సహాయ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్‌మెంట్ బెనిఫి ట్స్ అందించాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని, కార్మికులందరికీ షరతులు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ రాంచందర్, పరేషా, యాదయ్య, మల్లయ్య, మాసయ్య, పద్మ, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో కలపొద్దు
చేవెళ్ల: నూతనంగా ఏర్పాటు చేయనున్న చేవెళ్ల మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చే యోద్దంటూ రామన్నగూడ గ్రామస్తులు శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. చేవెళ్లకు దూరంగా ఉన్న తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దన్నారు. గ్రామంలో ఇప్పటికీ ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. మున్సిపాలిటీలో కలిపితే పన్నుల భారాన్ని తట్టుకోలేమని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment