ఆయిల్ పామ్ దిశగా అడుగులు
జిల్లాలో మొదటి సారి ఆయిల్ పామ్ దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉద్యాన వన పంటలను సాగుచేస్తున్నారు. ఇటీవల ఆయిల్ పామ్ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించింది. మన జిల్లాలో 35,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు నేలలు అనుకూలంగా ఉన్నాయని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది కనీసం 2వేల ఎకరాల్లో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు 1,750 మంది రైతులు సాగు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో పంట సాగు ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment