సీపీఎం సభలకు సిద్ధం
● నేడు, రేపు పార్టీ జిల్లా మహాసభలు ● ముస్తాబవుతున్న ఇబ్రహీంపట్నం ● హాజరుకానున్న రాష్ట్రస్థాయి నేతలు
ఇబ్రహీంపట్నం: సీపీఎం జిల్లా మహాసభలకు ఇబ్రహీంపట్నం ముస్తాబవుతోంది. శని, ఆదివారాల్లో నిర్వహించనున్న సభల కోసం ప్రధాన చౌరస్తాలు, రోడ్ల వెంట, డివైడర్లపై ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి. మహాసభలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిసాయి. మొదటిరోజు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. పార్టీ చేస్తున్న పోరాటాలు, చేయాల్సిన కార్యక్రమాలను వివరించనున్నారు. సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జాన్‌వెస్లీ, డీజీ నరసింహారావు హాజరుకానున్నారు. మరుసటి రోజు ఆదివారం వరకు స్థానిక భారత్ గార్డెన్‌లో జరిగే ప్రతినిధుల సభలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించడంతోపాటు వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్చాచరణ రూపొందించనున్నారు. పార్టీ జిల్లా నూతన సారథులను ఎన్నుకోనున్నారు. కొత్త కార్యవర్గం ఎన్నిక, వివిధ అంశాలపై చేసిన తీర్మానాలతో సభలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment