నందిగామ: ద్విచక్రవాహనంపై రాంగ్ రూట్‌లో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన మండల పరిధిలోని పాత జాతీయ రహదారిపై రాయలసీమ పరిశ్రమ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన శోభాదాస్(35), శంబుదాస్‌లు స్నేహితులు. వీరు కొత్తూరులో నివాసం ఉంటున్నారు. శోభాదాస్ వీర్లపల్లి శివారులోని మహవీర్ పరిశ్రమలో, శంబుదాస్ కొత్తూరు సమీపంలోని వినాయక స్టీల్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పని నిమిత్తం అయ్యప్ప స్వామి టెంపుల్ వైపు నుంచి నందిగామ వైపునకు ఇద్దరు బైక్‌పై రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక రాయలసీమ ఐరన్ పరిశ్రమ సమీపంలో షాద్‌నగర్ నుంచి కొత్తూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న శోభాదాస్(35) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. శంబుదాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి సొదరుడు శ్రావణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
బిహార్ కార్మికుడి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment