పారదర్శకంగా అర్హుల ఎంపిక
చెరకు రైతుకు చేదు అందరికీ తీపిని పంచే చెరకు.. పండించిన రైతులకు చేదును మిగుల్చుతోంది. మద్దతుధర లేక నష్టాలను మిగుల్చుతోంది.
8లోu
9లోu
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాళ్లు, రప్పలతో కూడిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని, కేవలం సాగుకు యోగ్యంగా ఉన్న భూములకే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ అంశాలపై శనివారం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు, అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసే పైపథకాల అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. గ్రామ, మున్సిపల్ స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహించి అర్హుల జాబితాను వెల్లడించాలని సూచించారు.
ఉగాది నుంచి సన్న బియ్యం
పౌరసరఫరాల విభాగం ద్వారా వచ్చే ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీలకు రెండు విడతలుగా రూ.12,000 అందజేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అవకాశం ఇవ్వాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వ భూమిలో రాజీవ్ స్వగృహ తరహాలో పది అంతస్తుల భవనం నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని, సన్నవడ్ల బోనస్ రూ.500 బ్యాంకు ఖాతాలో జమ కాలేదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే లీడ్ బ్యాంక్ అధికారికి వివరాలు ఇచ్చి ఆయా రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చూడాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు సూచించారు.
21నుంచి అర్హుల జాబితా ప్రకటన
రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పైనాలుగు పథకాలకు సంబంధించి ఈ నెల 11 నుంచి 13 వరకు షెడ్యూలు తయారు చేస్తామని, 16 నుంచి 20 వరకు ఆయా శాఖల బృందాలు అర్హులను గుర్తిస్తారని తెలిపారు. 21 నుంచి 24 వరకు ఆయా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో అర్హుల జాబితాను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు భరోసా, రేషన్ కార్డుల అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగారపు దయానంద్, శాసన సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్స్ కమిషనర్ కె.శశంక, మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పొట్రు, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించండి
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులకు అవగాహన సమావేశం
Comments
Please login to add a commentAdd a comment