కుంగ్‌ఫూ మాస్టర్‌కు నంది అవార్డు
షాద్‌నగర్: పట్టణానికి చెందిన న్యూ పవర్‌కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన ఎండీ మాస్టర్ అహ్మద్‌ఖాన్ నంది అవార్డు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికాడ్స్ నంది అవార్డులను ఇస్తున్నారు. ఈ మేరకుశనివారం హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గాన సభలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులకు కరాటే, కుంగ్‌ఫూలో శిక్షణ ఇస్తున్న షాద్‌నగర్ పట్టణానికి చెందిన అహ్మద్‌ఖాన్ అవార్డుకు ఎంపిక అయ్యారు. సాహితీ వేదిక సభ్యులు ఆయనకు అవార్డుతో పాటు ధ్రువపత్రం అందజేసి సత్కరించారు.
వీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్‌పల్లి వీరాంజనేయస్వామి ఆలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుల్లేర్‌బోడ్‌తండాకు చెందిన శ్రీను నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఆలయ నిర్వాహకులు లక్ష్మారెడ్డి, సహజ కవి డేగ బాలరాజుయాదవ్, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యనాయక్, మాజీ సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా
ఉపాధ్యక్షురాలిగా సుగుణ
బడంగ్‌పేట్: కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎం.సుగుణ నియమితులయ్యారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు తగిన న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కలాంబ, పార్టీ నేతలు కేఎల్లార్, చల్లా నర్సింహారెడ్డి, చిగురింత పారిజాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘పట్టుతప్పిన’ ప్రాణం
పహడీషరీఫ్: నూతన భవనానికి పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహ్మద్ గుల్ఫాన్(23) కొంతకాలం క్రితం బోరబండ ప్రాంతానికి వలస వచ్చాడు. బాలాపూర్‌లోని సాదత్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో గుల్ఫాన్ ఇవరై రోజులుగా పీఓపీ పనులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా శనివారం ఇంటి మొదటి అంతస్తు ముందు భాగంలో ఏర్పాటు చేసిన తడకలపై మరో ఇద్దరితో కలిసి పనిచేస్తుండగా అదుపుతప్పి 11కేవీ విద్యుత్ వైర్లపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment