పండగ పూట.. ఇంటి బాట
సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు బారులు తీరారు. శనివారం ఉదయం నుంచే ఆంధ్రాకు వెళ్లేందుకు తమ వాహనాల్లో విజయవాడ జాతీయ రహదారిపై పోటీ పడ్డారు. పెద్దఅంబర్‌పేట్ వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులు తీరాయి. ఒక పక్క జాతీయ రహదారి విస్తరణ జరుగుతుండగా మరో పక్కన వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్ పోలీసులు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. – అబ్దుల్లాపూర్‌మెట్
Comments
Please login to add a commentAdd a comment