కూచిపూడిలో ధన్వశ్రీ ప్రతిభ
తాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన సరితాగోపాల్ దంపతుల కుమార్తె ధన్వశ్రీ కూచిపూడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. శ్రీశైల దేవస్థాన ధర్మపథం ప్రాంగణంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనల్లో ధన్వశ్రీ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ధన్వశ్రీకి నిర్వాహకులు ప్రశంసా పత్రం అందజేశారు. పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్‌లో ఒకటవ తరగతి చదువుతున్న ధన్వశ్రీ, నృత్య గురువు మంజుల వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంటోంది.
కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు
ధారూరు: ప్రజాపాలన గ్రామసభలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకొని, నెట్టేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ధారూరు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో కానిస్టేబుల్ రాందాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడికి వచ్చిన మైలారం ముందలి తండాకు చెందిన ఆంగోత్ బద్యనాయక్, రమావత్ శ్రీనివాస్ మద్యం మత్తులో సమావేశానికి అడ్డుతగిలారు. వీరిని కానిస్టేబుల్ రాందాస్ అదుపు చేయబోయారు. రెచ్చిపోయిన బద్యనాయక్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకోగా, శ్రీనివాస్ అతన్ని నెట్టేసాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment