జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆరా
అనంతగిరి: జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై భారత ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ విభాగం సీనియర్ రీజినల్ డైరక్టర్ డాక్టర్ అనురాధ మెడోస్ ఆరా తీశారు. వీరు 3 రోజుల పాటు జిల్లాలోని ఆయా పథకాల అమలును పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం డీఎంహెచ్‌ఓ వెంకటవరణ, ఇతర పీఓలతో జిల్లాలో అమలవు తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన జాతీయ కీటక జనత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, మాతాశిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం అమలు.. అందుకు సంబంధించిన నిధుల విడుదల, ఖర్చులు.. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు.. వాటి ఫలితాల గురించి సమీక్షించారు. అనంతరం వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడ అమలవుతున్న తీరును పరిశీలించారు. మరో రెండు రోజుల పాటు జిల్లా లో పర్యటించి ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లను తనిఖీ చేయనున్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ జీవరాజ్, రవీంద్ర, పీఓలు పవిత్ర, బుచ్చిబాబు, ప్రవీణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment