నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నీటి సమస్య పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ నుంచి తాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు ట్యాంకర్లను సిద్ధంగా ఉంచి, నీటి అవసరాన్ని తీర్చాలన్నారు. ప్రతి మండలంలో నీటి నిల్వలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండలాల వారీగా ఎన్ని పైప్ లైన్లు ఉన్నాయి.. ఏవేవి పని చేస్తున్నాయి.. ఏమైనా సమస్యలున్నయా అని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పైప్‌లైన్లు, బోర్లను పరిశీలించి లీకేజీలు ఉంటే వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వనరుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు స్థానిక అధికారులను నియమించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీఎంఎచ్‌ఓ వెంకటరవణ, మిషన్ భగీరథ అధికారి చల్మారెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, రురల్ వాటర్ సప్లై విభాగం అధికారులు, డీఈలు, ఈఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment