సోలార్ ప్లాంట్‌ఏర్పాటుకు స్థల పరిశీలన
కొడంగల్: మండలంలోని రుద్రారం గ్రామ శివారులో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అధికారులు శుక్రవారం భూమిని పరిశీలించారు. రుద్రారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 151లోని స్థలాన్ని తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ ఇతర అధికారులు పరిశీలించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అధికారులు తెలిపారు. వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్‌ను సోలార్ ద్వారా ఆయా గ్రామాల్లోనే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో, రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కుల్కచర్లకు
కేటీఆర్ రాక
కుల్కచర్ల: మండలంలో శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. దాస్యనాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి అజయ్ నాయక్ కోరారు.
కేంద్ర మంత్రిని కలిసిన మారుతీకిరణ్
పరిగి: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషిని బీజేపీ పరిగి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మారుతీకిరణ్ శుక్రవారం కలిశారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకరంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
ఘన సన్మానం
అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో చాలా కాలంగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐలు మీర్ ఫయాజ్ అలీ, జీవరత్నంను శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు అధికారులు చిన్న స్థాయి నుంచి నేడు ఎస్‌ఐ స్థాయి వరకు ఎదగడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఏఓ జ్యోతిర్మణి, ఏఆర్ డీఎస్పీ వీరేష్, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
కుల్కచర్ల మండలంలో
10 ఎంపీటీసీ స్థానాలు
కుల్కచర్ల: స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఎంపీటీసీ స్థానాల ముసాయిదాను ప్రకటించారు. కుల్కచర్ల మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు కుల్కచర్ల, కామునిపల్లి, పటేల్ చెరువు, కుస్మసముద్రం, అంతారం, బండవెల్కిచర్ల, ఘణపూర్, ముజాహిద్‌పూర్, పుట్టపహడ్, సాల్వీడు గ్రామాలను ఎంపీటీసీ కేంద్రాలు ప్రకటించారు. చౌడాపూర్ మండలంలో వాల్యనాయక్ తండా, చౌడాపూర్, ఈర్లవాగు తండా, మక్తవెంకటాపూర్, మల్కాపూర్, కల్మన్‌కాల్వ, కొత్తపల్లి, మరికల్ గ్రామాలను ఎంపీటీసీ స్థానాలుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment