పరిగిలో దొంగనోట్ల కలకలం!
● సీఎస్‌సీ సెంటర్‌లో ఇచ్చారన్న బాధిత మహిళ ● పోలీసులకు ఫిర్యాదు
పరిగి: పరిగి పట్టణంలో దొంగనోట్ల కలకలం రేపుతోంది. పట్టణానికి చెందిన సుగుణమ్మ ఖాతాలో క్రాప్‌లోన్ డబ్బు జమ కావడంతో ఈ నెల 24న స్థానిక సీఎస్‌సీ సెంటర్‌లో రూ.30 వేలు డ్రా చేసుకుంది. ఈ డబ్బును ఇంట్లో భద్రపరిచింది. శుక్రవారం ఉదయం అప్పుతీసుకున్న వ్యక్తి రావడంతో అందులో కొంత డబ్బు ఇచ్చింది. అక్కడే ఆ నోట్లను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో మహిళ తన వద్ద ఉన్న మిగతా నోట్లును కూడా చూసింది. అవికూడా దొంగ నోట్లని తేలడంతో అవాక్కయ్యింది. వెంటనే బాధిత మహిళా సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి నిర్వాహకుడిని నిలదీసింది. తాను మంచి నోట్లు ఇచ్చానని మీరే మార్చి తన వద్దకు తెచ్చారని చెప్పాడు. మీరే రూ.30 వేలు కవర్‌లో పెట్టి ఇచ్చారని మహిళ పదేపదే చెప్పడంతో సెంటర్ నిర్వాహకుడు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాడు. అందులో మిషన్‌లో నోట్లు లెక్కించి మహిళ చేతికి ఇచ్చినట్లు రికార్డయ్యింది. మహిళ తెచ్చిన నోట్లను మిషన్‌లో పెట్టగా అవి బయటకు రాలేదు. కౌంటింగ్ మిషన్‌లో దొంగనోట్లు పెడితే హారన్ వస్తుందని, నేను ఇచ్చిన సమయంలో హారన్ రాలేదని సీఎస్‌సీ సెంటర్ నిర్వాహకుడు తెలిపాడు. సుగుణమ్మ ఇంట్లో కానీ, మరెక్కడైనా డబ్బులు మార్పిడి జరిగి ఉండవచ్చని నిర్వాహకుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఎస్‌సీ సెంటర్ నిర్వాహకుడిని స్టేషన్‌కు పిలిచి విచారించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment