అనంతగిరి: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేద్దామని ఎస్పీ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వికారాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను పరిష్కరించేకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల (బ్లాక్ స్పాట్స్)ను గుర్తించి అక్కడ సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, పట్టణ ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. అనంతరం జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీటీఓ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ జోసెఫ్, సీఐ భీమ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment