363 పోస్టులు మంజూరు
కొడంగల్: మండలంలోని అప్పాయిపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 363 వివిధ రకాల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీఓ నంబర్ 3 విడుదల చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 117 పోస్టులు, కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 199 పోస్టులు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు 31 పోస్టులు, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలకు 16 పోస్టులను భర్తీ చేసుకునేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్‌తో పాటు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాప్, జనరల్ ఆసుపత్రి కోసం మెడికల్ సూపరింటెండెంట్ ఆర్‌ఎంఓతో పాటు వైద్యులు, మెడికల్ ఆఫీసర్స్, నర్సింగ్ స్టాప్, ఫార్మాసిస్టులు, రికార్డు అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌లతో పలు రకాల విభాగాలకు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు త్వరలో ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment