లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ
మోమిన్‌పేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా కొనసాగుతుందని అదనపు కలెక్టర్ సుధీర్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని మేకవనంపల్లిలో నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరై మాట్లాడారు. రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు అందుతాయన్నారు. ప్రజాపాలనలో చేసుకోనివారు గ్రామ సభల్లో అర్జీలు ఇవ్వచ్చని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు, భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12 వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు. ప్రతి పథకంలో అర్హులకు చోటు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్‌ఐ గోవర్ధన్, కార్యదర్శి సుగుణ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సుధీర్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment