ఎస్‌ఆర్ పురంలో మాల్దీవుల బృందం పర్యటన
పెందుర్తి: మండలంలోని సౌభాగ్యరాయపురం(ఎస్‌ఆర్‌పురం)లో మాల్దీవుల బృందం సోమ వారం పర్యటించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న సేవల గురించి తెలుసుకునేందుకు వీరు పర్యటించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లో రైతుకు అందుతున్న సేవలు, వాటి అమలు గురించి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. డీపీవో శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అప్పలరాజు, శిరీష, గ్రామీణాభివృద్ధి సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ నాగరాజు, ఎంపీపీ మధుపాడ నాగమణి, సర్పంచ్ దూది విజయలక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకటరావు పాల్గొన్నారు.
మహారాణిపేట: కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌తో భేటీ అయిన మాల్దీవుల ప్రజాప్రతినిధులు జిల్లా పర్యటనలో గుర్తించిన అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలోని పరిపాలనాపరమైన అంశాలు, విధానాలు, పద్ధతుల గురించి మాల్దీవుల ప్రజాప్రతినిధులకు కలెక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment