పట్టుబడిన విదేశీ మద్యం
75 బాటిల్స్ విలువ రూ.4 లక్షల పైమాటే..
ఎంవీపీకాలనీ: నగరంలో విదేశీ మద్యం పట్టుబడింది. అల్లిపురం అచ్చయ్యమ్మపేటలోని నానిబిల్లి గణేశ్వరరావు ఇంట్లో ఈ అక్రమ మద్యాన్ని ఎంవీపీకాలనీలోని సర్కిల్–2 ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.ఈశ్వరరావు, సర్కిల్–2 సీఐ జగదీశ్వరరావు మంగళవారం స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 11న రాత్రి అచ్చయ్యమ్మపేటలో గణేశ్వరరావు ఇంట్లో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విదేశీ మద్యం సీసాలతో పాటు ఖరీదైన పలు రాష్ట్రాలకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 18 విదేశీ మద్యం సీసాలతో పాటు గోవాకు చెందిన 21, కర్ణాటకకు చెందిన 7, తెలంగాణకు చెందిన 18, ఢిల్లీకి చెందిన 4, డిఫెన్స్‌కు చెందిన 7 మద్యం సీసాలు ఉన్నాయి. వీటి విలువ రూ.4 లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు. వీటిపై ఆరా తీయగా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తీసుకొచ్చినట్లు గణేశ్వరరావు చెప్పాడు. విదేశీ మద్యం సీసాలను తన మేనల్లుడు లక్ష్మణ్ అవినాష్ ద్వారా తెప్పించినట్లు, ఆయా మద్యం సీసాలను తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతనిపై ఎకై ్సజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సర్కిల్–2 సీఐ జగదీశ్వరరావు, ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment