లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
విశాఖలీగల్: జాతీయ లోక్ అదాలత్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. విశాఖ జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోటార్ ప్రమాదాలు, సివిల్, చెక్ బౌన్స్, రాజీపడదగిన క్రిమినల్ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. వెంకటరమణ మాట్లాడుతూ డిసెంబర్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నా రు. గాజువాక, భీమిలితోపాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని న్యాయమూర్తులు వర్చువల్గా ఈ సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వెంకట శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment