డాబాగార్డెన్స్: సెప్టిక్ ట్యాంక్ కార్మికుల భద్రత, మెరుగైన ఉపాధికి రూపొందించిన ‘నమస్తే’ పథకంలో సంబంధిత కార్మికులు నమోదు కావాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్(నమస్తే) పథకం కార్యాచరణలో భాగంగా జీవీఎంసీలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే కార్మికుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌లో పాల్గొనే డ్రైవర్లు, హెల్పర్లు సంబంధిత జోనల్ కార్యాలయాల్లో వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. ఈ పథకంలో నమోదుకాని వారిని సెప్టిక్ క్లీనింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా కార్మికులకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రెట్టింపు వైద్య సహాయం, వారి పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్స్, అధిక సబ్సిడీ ద్వారా సెప్టిక్ ట్యాంక్ అందించడం, భద్రత, జీవనోపాధి కల్పించేందుకు శిక్షణ, పీపీఈ కిట్స్ కూడా అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment