బతికున్నా చంపేశారు
● నకిలీ డాక్యుమెంట్లతో 7.2 ఎకరాల కబ్జాకు యత్నం ● కలెక్టర్, జేసీకి బాధిత మహిళ ఫిర్యాదు
మహారాణిపేట: బతికున్న వృద్ధురాలిని చనిపోయినట్టు సృష్టించారు..నకిలీ డ్యాక్యుమెంట్లతో ఆమెకు చెందిన భూమిని కాజేయాలని యత్నించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధిత వృద్ధురాలు గంటా సత్యవతి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గంటా సత్యవతి 1970లో పెందుర్తి మండలం, చీమలాపల్లి గ్రామంలో పట్టా నంబర్ 75లో సర్వే నంబర్ 24/3డీ2లో 15.96 ఎకరాల భూమిని ఆరి అప్పలస్వామి నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమిని 2012లో 22ఏలో చేర్చారు. దీనిపై గంటా సత్యవతి కోర్టులో కేసు వేసింది. ఈ సమయంలో కడప జిల్లాకు చెందిన వల్లూరు సోమశేఖర్ ఆ భూమిపై కన్నేశారు. సత్యవతి నుంచి 1998, సెప్టెంబర్17వ తేదీన 7.2 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. 2022లో గుంటూరు జిల్లాకు చెందిన ఖాన్ అనే వ్యక్తికి సత్యవతి జీపీఏ చేశారు. జీపీఏ ఆధారంగా ఆయ న అదే ఏడాది డిసెంబర్ 28న సీసీఎల్‌ఏకి వెళ్లి.. సెట్ 2 (1)/180/2023 తీసుకొచ్చారు. దీని ద్వారా రైతు వారి పట్టా పొందడానికి ఖాన్ ప్రయత్నించారు. ఇదిలావుండగా సత్యవతి మృతి చెందినట్టు వల్లూరు సోమశేఖర్ డాక్యుమెంట్లు సృష్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గంటా సత్యవతి సోమవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం విచారించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment